శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (18:03 IST)

'భీమ్లా నాయక్'.. నిజంగా ఇది పవర్ తుఫానే : చిరంజీవి

తన సోదరుడు, హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం "భీమ్లా నాయక్". శుక్రవారం విడుదలైన చిత్రం విడుదలైన తొలి రోజునే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ చిత్ర టాక్ మామూలుగా లేదు. దీంతో ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఇందులోభాగంగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన స్పందనను తెలియజేశారు. 
 
"భీమ్లా నాయక్ తిరుగులేని విజయం అందుకున్నందుకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను. నిజంగా ఇది పవర్ తుఫానే అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన భీమ్లా నాయక్‌ సెట్స్‌పై సోదరుడు పవన్ కళ్యాణ్, రానాలతో దిగిన ఫోటోలను పంచుకున్నారు. 
 
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చిన ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. దగ్గుబాటి రానా విలన్. నిత్యా మీనన్, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లు. శుక్రవారం వేకువజామున ప్రదర్శించిన తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. విమర్శలు సైతం పవన్, రానా నటనకు నోరెళ్లబెడుతున్నారు.