గురువారం, 30 నవంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (13:28 IST)

పవన్ కంటే రానాకే పాపులారిటీ : డైరెక్టర్ ఆర్జీవీ సెటైర్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోమారు టార్గెట్ చేశారు. పవన్ అభిమానిని అంటూనే సైలెంటుగా సెటైర్లు వేశారు. 'భీమ్లా నాయక్' ట్రైలర్ సోమవారం విడుదల కాగా, శుక్రవారం ఈ చిత్రం విడుదలైంది. వీటిపై ఆర్జీవీ స్పందించారు. 
 
"బాలీవుడ్‌లో పవన్ కంటే రానాకే ఎక్కువ పాపులారిటీ ఉందన్నారు. దీనికి కారణ బాహుబలి. ఈ సినిమాలో రానా విలన్‌గా కాకుండా హీరోగా కనిపించే అవకాశం ఉంది' అని ట్వీట్ చేశారు. 
 
అంతటితో ఆగని వర్మ... "భీమ్లా నాయక్ ట్రైలర్ చూస్తుంటే మూవీ యూనిట్ చాలా రానా పాపులారిటీని పెంచేందుకే పవన్ కళ్యాణ్‌ను తగ్గించినట్టు కనిపిస్తుందన్నారు. పవన్ అభిమానిగా నేను చాలా హర్ట్ అయ్యాను' అంటూ పేర్కొన్నారు. వర్మ చేసిన ఈ టీట్స్‌పై ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.