ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (08:48 IST)

పవన్ కళ్యాణ్ సినిమాల్లో "ది బెస్ట్" భీమ్లా నాయక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం "భీమ్లా నాయక్". శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. యూఎస్‌లో ప్రీమియర్ షోలు, తెలంగాణాలో బెన్ఫిట్ షోలు ప్రదర్శించారు. తొలి ఆటకే బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ టాక్ వచ్చేసింది. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్‌లోనే ది బెస్ట్ సినిమా ప్రతి ఒక్కరూ ఇదేనంటూ కితాబిస్తున్నారు. 
 
ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట ఇదే. 'భీమ్లా నాయక్' చిత్రంలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిలు పోటీ పడి నటించారని, పవన్ నటన అదిరిపోయిందని, యాటిట్యూడ్ చూపించడంలో పవన్‌ను మించిన వారు ఎవరూ లేరంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 
 
దీంతో పవన్ కళ్యాణ్ అభిమాలు పండగ చేసుకుంటున్నారు. తొలి ఆటలోనే హిట్ టాక్ రావడంతో థియేటర్లు దద్ధరిల్లిపోతున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు హంగామా మామూలుగా లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో సినిమా టాక్ గురించి తెగ చర్చ సాగుతోంది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద బ్యానర్లు, డప్పులు, దండలు, ఇలా పవన్ అభిమానుల ఉత్సాహం ఉకరలేస్తోంది. ఈ సినిమా చూసినవారంతా చెబుతున్న మాట ఒక్కటే. బొమ్మ సూపర్ హిట్ అని అంటున్నారు.