మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 ఫిబ్రవరి 2022 (19:35 IST)

పవన్ కళ్యాణ్ ఎవర్ గ్రీన్ హీరో.. ఆయన్ను హీరోయిన్ చేయలేరు కదా... సోమిరెడ్డి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం "భీమ్లా నాయక్" శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకానుంది. అయితే, ఈ చిత్రాన్ని అన్ని రకాలైన అడ్డంకులు కల్పించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా, సినిమా టిక్కెట్ ధరలను తక్కువ రేట్లకు విక్రయించాలని బలవంతంగా అధికారుల ద్వారా థియేటర్ యజమానులపై ఒత్తిడి తెస్తుంది. ఈ వైఖరిని ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. 
 
తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు మద్దతు పలికారు. పవన్ కళ్యాణ్ ఎవర్ గ్రీన్ హీరో. ఆయన్ను హీరో కాకుండా హీరోయిన్‌ను చేయగలరా అంటూ ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'భీమ్లా నాయక్' సినిమాకు ఏ విధంగా అడ్డంకులు సృష్టించాలి. పవన్ కళ్యాణ్ హీరో కాబట్టి ఆ సినిమా రిలీజై నష్టాలు వచ్చేంతవరకు సినిమా టిక్కెట్ల ధరల పెంపు లబ్ధి కలుగచేయకూడదని భావిస్తున్నట్టున్నారు. అసలు మీరేం చేయగలరు. పవన్ కళ్యాణ్‌ను హీరో కాకుండా హీరోయిన్‌ను చేయగలరా? పవన్ కళ్యాణ్ ఎవర్ గ్రీన్ హీరో, ఆయననేం చేయలేరు అని వ్యాఖ్యానించారు.