ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతం సవాంగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఛైర్మన్‌గా గౌతం సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన గురువారంతో ఖాకీ దుస్తులను వదులుకున్నారు.
ఏపీ ముఖ్యమంత్రిగా జనగ్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్ర డీజీపీగా ఏరికోరి గౌతం సవాంగ్‌ను నియమించిన విషయం తెల్సిందే. ఆయనకు డీజీపీగా మరికొంతకాలం సర్వీసు ఉంది. అయినప్పటికీ సీఎం జగన్ అభ్యర్థన మేరకు ఆయన ముందస్తుగా ఉద్యోగ విరమణ చేశారు.
అదేసమయంలో గౌతం సవాంగ్‌ను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి జగన్ నియమించారు. దీంతో ఆయన గురువారం ఆ బాధ్యతలను స్వీకరించారు. గురువారం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఆ సంస్థ ఛైర్మన్‌గా సవాంగ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా ప్రమాణం చేసిన సవాంగ్‌కు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు.