శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (08:57 IST)

"భీమ్లా నాయక్" స్టోరీ ఏంటంటే.. క్లుప్తంగా...

పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వచ్చిన చిత్రం "భీమ్లా నాయక్". శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను అందుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. థమన్ సంగీతం సమకూర్చారు. 
 
శుక్రవారం విడుదలైన ఈ సినిమా కథను క్లుప్తంగా పరిశీలిస్తే, తెంగింపు ఉన్న సిన్సియర్ పోలీస్ ఆఫీస్ పాత్రలో పవన్ మరోమారు అదరగొట్టేశారు. మద్యం మాఫియా డాన్‌గా రానా దగ్గుబాటి జీవించారు. మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న డేనియల్‌ను 'భీమ్లా నాయక్'  అరెస్ట్ చేస్తాడు. అతడిని అవమానకరంగా ఠాణాకు తరలిస్తాడు. డేనియల్ ఓ మాజీ ఆర్మీ అధికారి అని, ఆయన ఓ రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి (సముద్రఖని) కుమారుడని పవన్‌కు తెలియదు. 
 
ఈ విషయాలను ఆలస్యంగా తెలుసుకున్న భీమ్లా నాయక్... డేనియల్‌కు సారీ చెబుతాడు. ఆ తర్వాత స స్టేషన్ నుంచి విడుదల చేయించే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య పంతాలు పట్టింపులు, ఇగోలు ఎక్కువ అవుతాయి. అవి మరింతగా పెరిగి ఇద్దరి మధ్య వైరానికి దారితీస్తాయి. ఈ యుద్ధంలో చివరికి ఎవరు విజయం సాధిస్తారన్నదే ఈ చిత్ర కథ.