సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఫిబ్రవరి 2022 (14:10 IST)

అరచేతితో సూర్యకాంతిని ఆపలేరు.. 'భీమ్లా నాయక్‌'కు ఆర్ఆర్ఆర్ విసెష్

పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటించిన చిత్రం "భీమ్లా నాయక్". శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం తొలి ఆట నుంచి బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ చిత్రం ప్రదర్శనల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిని అనేక మంది తీవ్రంగా తప్పుబడుతున్నారు. ముఖ్యంగా, వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు తీవ్రంగా మండిపడ్డారు. 
 
ఏపీ సర్కారు థియేటర్లకు ఇచ్చిన నోటీసులను ఈ సందర్భంగా ఆయన పోస్ట్ చేశారు. థియేటర్ల సిబ్బంది నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. ఈ విషయాలను ఆర్ఆర్ఆర్ ప్రస్తావించారు. 
 
"లాలా భీమ్లా.. అడవిపులి గొడవపడి.. ఒడిసిపట్టు దంచికొట్టు.. కత్తిపట్టు అదరగొట్టు.. పవన్ కళ్యాణ్ గారికి, దగ్గుబాటి రానా గారికి శుభాకాంక్షలు. భారీ విజయం సాధించినందుకు ఆ సినిమా మొత్తానికి కూడా శుభాకాంక్షలు చెబుతున్నాను. అరచేతితో సూర్యకాంతిని ఆపలేరు" అని ఆర్ఆర్ఆర్ ట్వీట్ చేశారు.