శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 జనవరి 2022 (19:18 IST)

నా హత్యకు కుట్ర... ఎవరైనా నచ్చకపోతే జగన్ తీసేస్తుంటారన్న ఆర్ఆర్ఆర్

వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కుట్ర జరుగుతుందంటూ ఆరోపించారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన కిరాయి ముఠా సభ్యులతో ఈ ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్‌కు ఎవరైనా నచ్చకపోతే తీసేస్తుంటారంటూ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీకి అన్ని వివరాలతో లేఖ రాస్తానని వెల్లడించారు. 
 
అలాగే, గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ కార్యకర్త హత్య కేసుపై రఘురామ రాజు స్పందించారు. చంద్రయ్యను ఎంతో దారుణంగా హత్య చేశారన్నారు. వ్యవస్థ నచ్చకపోయినా, వ్యక్తి నచ్చకపోయినా సీఎం జగన్ తీసేస్తుంటారన్నారు. 
 
అయితే, తమ ప్రభుత్వానికి, ఓ ఆంగ్ల పత్రికకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, అందువల్ల ఆపత్రికో చిరంజీవిని రాజ్యసభకు పంపుతున్నారంటూ వచ్చిన కథనంపై రఘురామరాజు కూడా స్పందించారు. 
 
అయితే రాజ్యసభ సీటు కోసం చిరంజీవి వైకాపాలో చేరుతారని తాను భావించడం లేదన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే పనిని చిరంజీవి చేయరని తాను భావిస్తున్నట్టు చెప్పారు. 
 
అయినప్పటికీ సినీ పరిశ్రమ సమస్యలు చిరంజీవి వివరించకుంటే సీఎం జగన్‌కు తెలియవా అని ప్రశ్నించారు. సినీ రంగానికి ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తే న్యాయం చేయడానికి కోర్టులు ఉన్నాయన్నారు.