గురువారం, 28 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 28 ఆగస్టు 2025 (09:21 IST)

Allu Arjun: ప్రభాస్ తోపాటు అగ్ర హీరోలతో దర్శకులు క్రేజీ ట్విస్ట్ లు

Prabhas - Allu Arjun
Prabhas - Allu Arjun
ఒకప్పుడు ఒక హీరో సినిమాలే వస్తుండేవి. సినిమాలో రెండో హీరో వుండాలంటే ఇగో హర్ట్ అయ్యేది. ఫ్యాన్స్ మధ్య పోటీ పేరుతో అసలు హీరోలు పట్టించుకునేవారు కాదు. బాలీవుడ్ లో ఇద్దరు, ముగ్గురు హీరోలు కలిసి నటిస్తున్నారుగదా అని ఏ హీరోనైనా అడిగితే, మాకు చేయాలనుంది. కథ కలిసిరావాలనే వారు. కానీ కాలంతోపాటు హీరోల ఆలోచనలు మారిపోయాయి. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాల్లో ఒకరో ఇద్దరో ఫేమస్ హీరోలుంటున్నారు. అది ముందుగా రజనీకాంత్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది. 
 
ఇప్పుడు తెలుగులో కూడా అలాంటి సినిమాలు వస్తున్నాయి. చిన్న హీరోలు మనోజ్, నారారోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ వంటి హీరోలు కలిసి నటించడం సాధారణమే. దీనికి కారణం ఓటీటీలో వస్తున్న భిన్నమైన కథలు, తారాగణమే కారణంగా నిర్మాతలు చెబుతున్నారు.

తాజాగా చెప్పుకోవాలంటే ఒకప్పుడు విలన్ గా మోహన్ బాబు కు పెద్ద పేరుంది. చాలాకాలం తర్వాత గేప్ తీసుకున్న ఆయన రాజమౌళి యమదొంగ సినిమాలో మళ్ళీ మురిపించారు. ఆ తర్వాత మరలా సినిమాలు చేయలేదు. ఎందుకంటే తన స్థాయికి తగ్గ కథ, హీరో కుదరాలి అనేవారు. తాజా సమాచారం మేరకు మోహన్ బాబు ఓ పెద్ద దర్శకుడు, హీరో నటిస్తున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
 
ఇక మరో ముఖ్య సమాచారం ఏమంటే, ప్రభాస్ నటించనున్న స్పిరిట్ లో మెగాస్టార్ చిరంజీవి నటించనున్నాడని ఫిలింనగర్ కథనాలు వినిపిస్తున్నాయి. ఇందులో ఆయన కామియో రోల్ ప్లే చేయనున్నాడట. అందుకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కసరత్తు చేస్తున్నాడు. ఇప్పటికే ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ చిత్రాల షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ రెండు చిత్రాల్లో ప్రభాస్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అయితే, ఆ తర్వాత ప్రభాస్ తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేయబోతున్నాడు. స్పిరిట్  సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడట.
 
ఇవే కాకుండా రాబోయే అగ్ర హీరోల తెలుగు సినిమాల్లో ఎవరో ఒక క్రేజీ హీరో వుండబోతున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ నటించనున్న సినిమాలో కూడా మరో హీరో కనిపించనున్నాడని కథనాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆ హీరో హాలీవుడ్ హీరో అనే వార్త వినిపిస్తోంది.