శుక్రవారం, 21 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 నవంబరు 2025 (12:23 IST)

అంగారక గ్రహంపై బండరాయిని గుర్తించిన నాసా.. అందులో ఇనుము, నికెల్ మూలకాలు

Weird Rock on Mars
Weird Rock on Mars
నాసా అంగారక గ్రహంపై బండరాయిని గుర్తించింది. నాసాకు చెందిన పెర్సెవరెన్స్ రోవర్ అంగారక గ్రహంపై 80 సెంటీమీటర్ల (సుమారు 31-అంగుళాల) బండరాయిని గుర్తించింది. రోవర్ అన్వేషిస్తున్న జెజెరో క్రేటర్ సమీపంలోని రెడ్ ప్లానెట్‌లోని వెర్నోడెన్ వద్ద ఉన్న బెడ్‌రాక్‌ను పరిశీలిస్తున్నప్పుడు రోవర్ ఈ రాతిని కనుగొంది. సెప్టెంబర్ 19, 2025న రోవర్ తన లెఫ్ట్ మాస్ట్‌క్యామ్-జెడ్ కెమెరాను ఉపయోగించి ఈ చిత్రాన్ని తీసింది.
 
ఎ స్ట్రేంజర్ ఇన్ అవర్ మిడ్స్ట్.. అనే బ్లాగులో, నాసా ఈ రాతికి ఫిప్సాక్స్లా అని పేరు పెట్టబడిందని పేర్కొంది. ఈ రాయిని చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతూ దానిని నిశితంగా పరిశీలించారు. గత వారం, మిషన్ బృందం రాతిని నిశితంగా పరిశీలించి, దాని ఆకారం, పరిమాణం చుట్టుపక్కల భూభాగం నుండి భిన్నంగా ఉన్నాయని కనుగొన్నారు. ఈ రాయిలో ఇనుము, నికెల్ మూలకాలు అధిక సాంద్రతలో ఉన్నట్లు తేలింది. సాధారణంగా అంగారకుడి ఉపరితలంపై ఈ మూలకాలు అరుదుగా కనిపిస్తాయి. 
 
గ్రహశకలాల కేంద్ర భాగాల్లో ఏర్పడే ఐరన్-నికెల్ ఉల్కలలో ఇవి అధికంగా ఉంటాయి. దీన్ని బట్టి ఈ రాయి సౌర వ్యవస్థలో మరెక్కడో ఏర్పడి, అంగారకుడిపై పడి ఉండవచ్చని నాసా భావిస్తోంది. అయితే, దీన్ని ఉల్కగా అధికారికంగా నిర్ధారించడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని నాసా తెలిపింది.