ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (15:09 IST)

సీఐడీ దాడి కేసు విచారణను త్వరితంగా పూర్తి చేయండి : డీజీపీకి ఆర్ఆర్ఆర్ లేఖ

తనపై సీఐడీ దాడి చేసిన కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరారు. ఈ మేరకు ఆయన ఏపీ కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. ఇందులో తనపై సీఐడీ అధికారుల దాడి ఘటనపై త్వరగా దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేశారు. 
 
ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేయాలని ఆయన కోరారు. తప్పుడు కేసులు బనాయించి తనను చిత్రహింసలకు గురిచేశారని డీజీపీకి రఘురామ వెల్లడించారు. ఈ దాడి కేసులో ప్రధానంగా సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. 
 
ఈ దాడి ఘటనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నివేదిక కోరినప్పటికీ అప్పటి డీజీపీ గౌతం సవాంగ్ స్పందించలేదని పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకర్ కోరిక మేరకు దర్యాప్తును పూర్తి చేసి నివేదికను త్వరితగతిన అందజేయాలని ఆయన కోరారు.