మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (22:41 IST)

జెలెన్ స్కీని యోధుడిగా అభివర్ణించిన సమంత

ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యాపై యావత్తు ప్రపంచం ఫైర్ అవుతోంది. రష్యాపై పలువురు సెలెబ్రిటీలు రష్యా సైనిక చర్యను ఖండించారు. 
 
ఇప్పటికే బాలీవుడ్‌ హీరోయిన్‌ అమీ జాక్సన్‌ సైతం ఉక్రెయిన్‌, రష్యా ఉద్రిక్తతలపై రియాక్ట్ అయ్యారు. బాధిత దేశంలో ఇబ్బందులు పడుతున్న పిల్లలకు సాయం అందించాలని ఆమె ప్రజలను అభ్యర్థించింది.
 
తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత రష్యా చర్యను తీవ్రంగా ఖండించారు. ఇన్‌స్టా వేదికగా ఓ పోస్టు చేస్తూ.. ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీని ఓ యోధుడిగా అభివ‌ర్ణించారు. 
 
"యోధుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడిని చరిత్ర  కనుగొంది.. అతని తెగువ, ధైర్యసాహసాలే దానికి సాక్ష్యం" అని ఉన్న న్యూస్‌ ఆర్టికల్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ని ఆమె షేర్ చేశారు.