సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 మార్చి 2022 (09:35 IST)

తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌పై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. 
 
టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైనట్లు ట్వీట్ చేశారు. ఈ అకౌంట్‌ని పునరుద్ధరించేందుకు ట్విట్టర్ ఇండియాతో మాట్లాడుతున్నామని నారా లోకేష్ పేర్కొన్నారు.  
 
టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిన వెంటనే ఐటీ విభాగం అప్రమత్తమైంది. ట్విట్టర్‌లో అసభ్య మెసేజ్‍లు పంపినట్టు గుర్తించింది. అయితే ఎలాంటి నష్టం జరగలేదని టీడీపీ ఐటీ విభాగం స్పష్టం చేసింది.