గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 9 మార్చి 2022 (11:00 IST)

తెలుగుదేశం పార్టీకి ఎక్స్‌పైరీ డేట్ అయిపోయింది: రోజా కామెంట్స్

తలకిందులుగా తపస్సు చేసినా, పిల్లిమొగ్గలు వేస్తూ ఓట్లు అడిగినా ఏపీ ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయరని రోజా వ్యాఖ్యానించారు. ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందనీ, ఇక ఆ పార్టీకి జనం ఓట్లు వేయరంటూ షాకింగ్ కామెంట్లు చేసారు.

 
వచ్చే ఎన్నికల్లో 160 సీట్లు గెలుస్తామంటూ బీరాలు పలుకుతున్న తెదేపా నాయకులు ఇపుడున్న 23 సీట్లు కూడా గెలవలేరనీ, చిత్తుచిత్తుగా ఓడిపోయి ఫ్యాను గాలికి కొట్టుకుపోతారని అన్నారు. జగన్-చంద్రబాబు సేమ్ టు సేమ్ కాదనీ, జగన్ ప్రజల మనిషి అని చెప్పుకొచ్చారు.

 
మరోవైపు రోజా వ్యాఖ్యలపై అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. మహిళా దినోత్సవ వేడుక వేదికను రోజా వేరే రకంగా వాడుకున్నారనీ, అదేదో జబర్దస్త్ వేదికలా సెటైర్లు వేస్తూ వాళ్ల పార్టీ కార్యకర్తల చప్పట్ల కోసం మాట్లాడినట్లుందని అన్నారు.