సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 13 జనవరి 2022 (11:19 IST)

తెదేపా నాయకుడు దారుణ హత్య: కర్రలు, రాళ్లతో కొట్టి చంపారు

గుంటూరు జిల్లాలో దారుణ హత్య జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రయ్యను గుర్తు తెలియని దుండగలు అత్యంత దారుణంగా హతమార్చారు.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్ల వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చంద్రయ్యపై దాడి చేసారు. కర్రలు రాళ్లతో కొట్టి దారుణంగా హతమార్చారు.

 
చంద్రయ్య గుంటూరు జిల్లా మాచర్ల తెదేపా ఇంచార్జి జూలకంటి బ్రహ్మరెడ్డికి అనుచరుడిగా వున్నారు. చంద్రయ్య హత్యకు రాజకీయ కారణాలా లేదంటే వ్యక్తిగత కక్షలా అనేది తేలాల్సి వుంది.