ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?
Harihara Veeramallu- Pawan
పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు షూటింగ్ నుంచి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంది. ముందుగా దర్శకుడు క్రిష్ కొంత భాగం షూట్ చేశారు. ఆ తర్వాత ఏమయిందో ఏమోకానీ దర్శకుడు మారాడు. నిర్మాత ఎ.ఎం. రత్నం పెద్ద కుమారుడు దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత కొన్ని రాజకీయ కారణాలవల్ల పవన్ కళ్యాణ్ షూట్ లో పాల్గొనలేకపోయాడు. దాంతో షూటింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత తిరిగి షూట్ మొదలు పెట్టాక సునీల్ తోపాటు నాజర్ వంటి ప్రముఖుల డేట్స్ క్లాష్ అయ్యాయి. వీటిని సరిచేసేందుకు తాను కష్టపడాల్సి వచ్చిందని ఎ.ఎం. రత్నం స్వయంగా తెలియజేశారు.
అసలు సినిమా తీయడమే కష్టంగా మారింది. ఒకప్పుడు సినిమా చేయడమంటే చాలా ఆనందంగా వుండేది. కానీ హరిహర వీరమల్లు సినిమా నాకు ఒకరకమైన నిరాశకు గురిచేసింది. అందుకు చాలా ఉదంతాలున్నాయి. ఓసారి అందరి డేట్స్ తీసుకుని షూట్ చేయాల్సివుంది. ఆ టైంలో ఓ చోట వేరే వారు సెట్ వేసిన దానిని పీకేసి అక్కడ షూట్ చేయాలి. అది మన రాష్టం కాదు. అక్కడ రవాణా సౌకర్యంలేదు. ఇంచుమించు ఫారెస్ట్ ఏరియా. చుట్టూ గ్రామాలవారికి పిలుద్దామంటే కొండలు ఎక్కి వెళ్ళాలి.
సెల్ ఫోన్స్ సరిగ్గా పనిచేయవు. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ వారి ఫోన్లు వాడాలి. సెట్ తీసి మరో సెట్ వేయాలంటే కనీసం రోజు పడుతుంది. ఈలోగా ఆర్టిస్టుల డేట్స్ మళ్ళీ దొరకవు. ఒకరకంగా దేవుడిలా పవన్ కళ్యాణ్ మీరు ఎప్పుడంటే అప్పుడు చేద్దాం అనే భరోసా ఇచ్చారు.
అయినా నిర్మాతగా నా బాధ్యత వుంటుంది. మిగిలిన ఆర్టిస్టులను ఏదోవిధంగా సరిచేసుకుని సినిమా చేశాను. నా జీవితంలో ఇంత టెన్షన్ పడింది. కష్టపడింది ఏ సినిమాకూ లేదు. అలాంటి సినిమాను మరో మూడు రోజుల్లో విడుదలచేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టమన్నారు. ఆయన పలు విషయాలు చెబుతున్నారు. ఏదిఏమైనా ఈ సినిమాపై వస్తున్న గాసిప్స్ కు ఫుట్ స్టాప్ పెట్టి అఖండ విజయం సాధిస్తుందనే ధీమా కలిగిందని అన్నారు.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో పవన్ కటౌట్స్ తో నిన్నటి నుంచే మంచి కోలాహలం మొదలైంది. ఇక వీటితో పాటుగా బెంగళూరులో కూడా అభిమానులు సందడి మొదలు పెట్టగా అక్కడ పవన్ వీరమల్లు కటౌట్ పక్కనే అకిరా నందన్ ఇద్దరూ కటౌట్స్ కలిపి కనిపించిన ఫ్రేమ్ సోషల్ మీడియాలో మంచి వైరల్ గా మారింది. ఇక అకిరా ఎంట్రీ కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు.