ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !
Vijay Deverakonda at home
విజయ్ దేవరకొండ కొత్త సినిమా కింగ్ డమ్ ను ముందుకు రాబోతున్నాడు. తనఇంటినుంచే ప్రచారాన్ని మొదలు పెట్టాడు. కుర్చీలో కూర్చుని తుపాకి చేతితో పట్టుకుని మొత్తం తగలబెడతానికి సిద్ధమంటూ కాప్షన్ తో అలరిస్తున్నాడు. పలు భాషల్లో విడుదలకాబోతున్న ఈ సినిమాపై విజయ్ దేవరకొండ చాలా ఆశలు పెట్టుకున్నాడు. జులై 31న విడుదలకాబోతున్న ఈ సినిమాకోసం తదుపరి 10 రోజులు ప్రమోషన్లు ప్రారంభమవుతాయి.
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన భారీ చిత్రం మంచి అంచనాలు సెట్ చేసుకుంది. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ గ్యాప్ లో ట్రైలర్ ఇంకా రావాల్సి ఉంది. అయితే ఈ ట్రైలర్ పై లేటెస్ట్ న్యూస్ తెలుస్తోంది. ట్రైలర్ జూలై 25న విడుదల చేస్తున్నట్టుగా సమాచారం. అనిరుద్ సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలు, సంగీతం హైలైట్ గా అవుతుాయని చెబుతున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.