సంబంధిత వార్తలు
- సింగయ్య మృతి కేసు - జగన్ అరెస్టు తప్పదా? హైకోర్టులో క్వాష్ పిటిషన్
- జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల
- సింగయ్య మృతి : పోలీసుల అదుపులో వైఎస్ జగన్ కారు డ్రైవర్
- 16 యేళ్ల బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న 60 యేళ్ల వృద్ధుడు...
- Annavaram: 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో పెళ్లి- వధువు ఏడుస్తుంటే..?
యువతిని కత్తితో బెదిరించి యేడాదిగా వృద్ధుడి అత్యాచారం...
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో ఓ దారుణం జరిగింది. ఒక వృద్ధుడు ఒక యువతిని కత్తితో బెదిరించి యేడాదికాలంగా అత్యాచారం చేసున్నాడు. ఈ నెల 13వ తేదీన తన తమ్ముడితో కలిసి వెళుతుండగా మళ్లీ బెదిరించాడు. ఆ తర్వాత ఆ యువతి మెడలో దారం వేసి ఫోటో దిగి పెళ్ళయినట్టుగా చిత్రీకరించడంతో ఆమె తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో వారు బాధితురాలిని పోలీసుల వద్దకు తీసుకెళ్లారు.
ఈ ఘటన చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో ఆదివారం వెలుగు చూసింది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మండలానికి చెందిన 22 యేళ్ల యువతి కొంత వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా అదే గ్రామానికి చెందిన వరుసకు మామ అయ్యే 60 యేళ్ళ వృద్ధుడు యువతిని కత్తితో బెదిరించి యేడాది కిందట యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత పలుమార్పు బెదిరించి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెబుతానని యువతి అనడంతో మీ నాన్న తాగే మద్యంలో విషం కలిపి చంపుతా అని బెదిరించినట్టు యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. వారిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
