శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (12:12 IST)

నా బిడ్డను ప్రజల చేతుల్లో పెడుతున్నా.. ధర్మవరం నుంచి పోటీ: పరిటాల సునీత

అనంతపురం జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. జిల్లా రాజకీయాలపై గట్టిపట్టు ఉన్న పరిటాల కుటుంబం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనడానికి ఇప్పటి నుంచే సన్నాహాలను మొదలు పెట్టడమే దీనికి కారణం. ఈ విషయంపై పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి ప్రమేయం లేకుండానే అసెంబ్లీ స్థానాలను సెలెక్ట్ చేసుకుందనే ప్రచారం జిల్లాలో ఉంది.
 
అనంతరం ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్‌గా మారడంతో ఈ నియోజకవర్గాన్ని పరిటాల కుటుంబం వీడాల్సి వచ్చింది. 2009లో ఎస్సీ రిజర్వుడ్ కావడంతో బీకే పార్థసారథి టీడీపీ నుంచి రెండుసార్లు ఇక్కడి నుంచి గెలిచారు. ప్రస్తుతం ఈ స్థానంపై వైఎస్‌ఆర్సీపీ జెండా ఎగరేసింది. 
 
పెనుకొండ ఎస్సీ రిజర్వుడ్‌గా మారడంతో పరిటాల కుటుంబం.. రాప్తాడు నియోజకవర్గానికి వలస వెళ్లాల్సి వచ్చింది. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి పరిటాల సునీత ఈ స్థానం నుంచి పోటీ చేసి, ఘన విజయం సాధించారు. 
 
2019 ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను ఎన్నికల బరిలో దింపారు. చేదు ఫలితాన్ని చవి చూశారు. తన అరంగేట్రం ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ దారుణంగా పరాజయాన్ని చవి చూశారు. 25 వేలకు పైగా ఓట్ల తేడాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతులో ఓటమి పాలయ్యారు. 
 
మరోసారి ధర్మవరం నియోజకవర్గంలో తల్లి పరిటాల సునీతతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుంచి పోటీ చేస్తారని తెలిపారు. తన బిడ్డను ధర్మవరం ప్రజల చేతుల్లో పెడుతున్నానని, ఆశీర్వదించాలని విజ్ఙప్తి చేశారు. 
 
ముదిగుబ్బ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. కదిరి పార్టీ ఇన్‌ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్, హిందూపురం పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ శ్రీనాథ్ రెడ్డి దీనికి హాజరయ్యారు.