మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 డిశెంబరు 2021 (13:06 IST)

ఆ నేత టీడీపీ టిక్కెట్ తెచ్చుకుంటే రాజకీయాలకు గుడ్‌బై :: పరిటాల శ్రీరామ్

వచ్చే ఎన్నికల్లో ధర్మవరం అసెంబ్లీ టిక్కెట్‌ను తెచ్చుకుంటానని ఓ నేత ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్నాడనీ, నిజంగానే ఆయన తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌ను తెచ్చుకుంటే మాత్రం తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్ బహిరంగ సవాల్ విసిరారు. 
 
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని దుర్గా నగర్ టీడీపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధర్మవరం అసెంబ్లీ టిక్కెట్‌ను తాను తెచ్చుకుంటానని ఓ నేత ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నిజంగానే ఆయన టిక్కెట్ తెచ్చుకుంటే మాత్రం తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని ఆ మాజీ ఎమ్మెల్యేను ఉద్దేశించి పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యానించారు. 
 
ఇలా సొంత డబ్బా కొట్టుకునేవారి గురించి ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అదేసమయంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ తమవంతుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు.