బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 10 నవంబరు 2021 (22:23 IST)

బద్ధ శత్రువులు సన్నిహితులయ్యారు, లోకేష్ పుణ్యమేనా?

అనంతపురం జిల్లాలో తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్ పర్యటన కాస్త ఆశక్తికరమైన సంఘటనకు దారితీసింది. బద్ధశత్రువులైన రెండు కుటుంబాలు సన్నిహితంగా మెలిగాయి. పరిటాల శ్రీరాంతో సన్నిహితంగా మెలిగారు జె.సి.ప్రభాకర్ రెడ్డి. 

 
టిడిపి నేతలు జె.సి.ప్రభాకర్ రెడ్డి, పరిటాల శ్రీరామ్‌లు సన్నిహితంగా మెలగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎస్ఎస్‌బిఎన్ కళాశాల వద్ద జరిగిన విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో టిడిపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్ చేపట్టిన అనంతపురం పర్యటనలో ఈ దృశ్యం కంటపడింది.

 
పరిటాల శ్రీరామ్ ఎదురుపడడంతో జెసీ ప్రభాకర్ రెడ్డి ఆప్యాయంగా పలుకరించడంతో పాటు ఇరువురు నేతలు సన్నిహితంగా మెలుగుతూ కనిపించారు. గతంలో ఈ రెండు కుటుంబాల మధ్య బద్ధశతృత్వం ఉండేది.

 
అలాంటి కుటుంబాల్లోని ఇద్దరు ముఖ్యలు కలవడం.. మాట్లాడుకోవడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. నారా లోకేష్ కన్నా వీరిద్దరనే స్థానిక నేతలు ఎక్కువసేపు చూస్తూ కనిపించారు. ఇదంతా లోకేష్ పుణ్యమే అంటూ చాలామంది నేతలు మాట్లాడుకుంటుండటం కనిపించింది.