శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 ఆగస్టు 2021 (12:40 IST)

గతంలో జుట్టు పెంచితే పన్ను.. ఇపుడు మీసం మొలేస్తే కేసు : జేసీ ప్రభాకర్ రెడ్డి

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి రాజకీయాలు రోజురోజుకూ వేడెక్తుతున్నాయి. అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో తాడిపత్రి రాజకీయాలు సెగలు కక్తుతున్నాయి. ముఖ్యంగా, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్యలపై మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల బాంబులు పేలుతున్నాయి.
 
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి అంతే స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. మీసం తిప్పితేనే కేసు పెడుతారా.. ఇలాంటి వాటికి భయపడేది లేదన్నారు. 
 
గతంలో పెద్దారెడ్డి మాట్లాడిన వాటిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు కేసుల్లేవన్నారు. మరి నాపైనే ఎందుకు కేసులు పెడుతున్నారని ప్రశ్నించారు. అంతేకాదు మీసం తిప్పితే కేసు పెడతారా? నా మీసం నా ఇష్టం అని ప్రభాకర్ రెడ్డి అన్నారు. దీనిపై ఎంతవరకైనా వెళ్తానని ప్రకటించారు. 
 
గతంలో ఒక రాజు జుట్టు పెంచితే పన్నులు వేసేవారని.. ఇప్పుడు మీసం తిప్పితే కేసులు పెడుతున్నారని జేసీ వ్యాఖ్యానించారు. మీసం తిప్పితే కేసేంటని ఆయన ప్రశ్నించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదంటున్నారు.