గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 జులై 2021 (15:18 IST)

పెద్దారెడ్డి... నీ ఫేస్ టర్న్ చేసి ఓసారి అద్దంలో చూసుకో... జేసీ ప్రభాకర్

అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తన విమర్శలకు పదును పెంచారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. 'పెద్దారెడ్డి... నీ ఫేస్ టర్న్ చేసి ఓసారి అద్దంలో చూసుకో... నిన్ను చూసి ఓట్లు ఎవరూ వేయలేదు' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఎమ్మెల్యే స్థానంలో ఉండి అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్‌ వాడుతున్నావంటూ అబ్జెక్షన్‌ చెప్పారు. తాడిపత్రిలో నడిరోడ్డు మీదకు వస్తా.. రా చూసుకుందామంటూ జేసీ ప్రభాకర్‌ రెడ్డి సవాల్ విసిరారు. 'కమీషన్ల కోసం ఇంట్లో నాలుగు బాక్సులు పెట్టుకున్నావ్… తాడిపత్రి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నీ భార్యని కూడా ఇందులోకి లాగావు', ఇది మంచిది కాదు అంటూ హితవు పలికారు. ఎన్ని ఇళ్లు కూలుస్తామని చెప్పావ్.. ఇప్పుడు ఎన్ని కూల్చావంటూ ప్రశ్నలు సంధించారు. 
 
నీకు దమ్ముంటే ‘నా మీద ఛార్జి షీట్ వేయించు.. జైలుకు పంపించు’ అంటూ  సవాల్‌ విసిరారు. ఇటీవల తాడిపత్రి సీపీఐ కాలనీలోని మున్సిపల్ స్థలంలో కొందరు అక్రమంగా ఇళ్లు కట్టుకున్నారని అధికారులు నోటీస్‌ జారీ చేశారు. 6 రోజుల క్రితం మున్సిపల్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇళ్ల కూల్చివేతకు మార్కింగ్‌ కూడా ఇచ్చారు. 
 
అయితే వీరిలో టీడీపీకి సపోర్ట్‌ చేసిన సీపీఐ కౌన్సిలర్‌ కూడా ఉన్నారు. దీంతో విషయం తెలుసుకున్న మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌన్సిలర్‌ కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి కౌన్సిలర్లను వేధించడం పద్ధతి కాదని హెచ్చరించారు.