అనంతలో ఇండస్ జీని ఎక్స్ప్రెషన్స్ లిమిటెడ్ పరిశీలించిన మేకపాటి
స్కిల్ డెవలప్ మెంట్, పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దూరదృష్టితో వ్యవహరిస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. అనంతపురంలో మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఉద్యోగాలున్నా, పరిశ్రమలున్నా యువతలో స్కిల్ అప్ గ్రేడేషన్ చాలా అవసరమన్నారు. అనంతపురం జిల్లాలోని చిలమత్తూరు మండలం కోడూరు గ్రామంలోని ఇండస్ జీని ఎక్స్ప్రెషన్స్ లిమిటెడ్ పరిశ్రమను మంత్రి సందర్శించారు.
పరిశ్రమల మంత్రికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్, పుట్టపర్తి, కదిరి ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి, డా.సిద్దా రెడ్డి, రాష్ట్ర పాఠశాల విద్యా నియంత్రణ కమిటీ సి ఈ ఓ సాంబశివారెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.ఏ.సిరి,సబ్ కలెక్టర్ నవీన్, పరిశ్రమ ప్రతినిధులు స్వాగతం పలికారు. పరిశ్రమను క్షుణంగా పరిశీలించిన అనంతరం మేకపాటి మీడియా సమావేశంలో మాట్లాడారు. త్వరలో రాష్ట్రానికి విరివిగా పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నామని, కొత్త పరిశ్రమలకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నామన్నారు.