శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 జూన్ 2021 (13:30 IST)

ఏపీలో విలువ ఆధారితంగా పన్నులు.. విపక్షాల ఫైర్

ఏపీలో ఆస్తి అద్దె ఆధారిత స్థానంలో విలువ ఆధారితంగా పన్నులు విధించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పన్నులు పెంచుతూ ఇచ్చిన జీవోను వెనిక్కి తీసుకోవాలని లేనిపక్షంలో ఉద్యమం చేపడతామని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. 
 
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఆస్తి పన్నును పెంచుతూ జారీ చేసిన జీవో రాజకీయంగా దుమారం రేపుతోంది. నూతన పన్ను విధానంతో ఆస్తి పన్ను ప్రస్తుతమున్న దానికంటే ఏకంగా 3 నుంచి 20 రెట్ల మేర పెరగనుందని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి.
 
ఇదిలా ఉంటె పట్టణాల్లో ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను, చెత్త పన్ను వేయడాన్ని నిరసిస్తూ ఈనెల 16, 17 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వార్డు సచివాలయాల వద్ద నిరసనలకు ఆంధ్రప్రదేశ్‌ పట్టణ పౌర సమాఖ్య పిలుపునిచ్చింది. ఆస్థి పన్నును పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.