బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

బాలిక శీలం ఖరీదు రూ.50 వేలు : ఐదు చెప్పుదెబ్బలు

ఉత్తరాది రాష్ట్రాల్లో మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందని చెప్పొచ్చు. ఒకవేళ ఒక యువతి అత్యాచారానికి గురైతే పంచాయతీ పెద్దలే తీర్పునిస్తారు. వారు చెప్పేదే ఫైనల్ అవుతుంది. తాజాగా అత్యాచారానికి గురైన ఓ బాలిక శీలానికి పంచాయతీ పెద్దలు వెల కట్టారు. అత్యాచారం చేసిన కామాంధుడుకి రూ.50 వేల అపరాధం విధించారు. ఐదు చెప్పు దెబ్బలు కొట్టాలని తీర్పునిచ్చారు. 
 
ఈ తీర్పు రాష్ట్రంలో సంచలనంగా మారింది. గ్రామ పెద్దలు తనకు న్యాయం చేయకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన మహారాజ్ గంజ్ జిల్లాలోని కోఠిభర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. ఈ నెల 23వ తేదీన బాధితురాలు తోటలో కూరగాయలు కోస్తుండగా కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో వారు శీలానికి రూ.50 వేలు ధర నిర్ణయిస్తూ తీర్పునిచ్చారు.