సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 11 డిశెంబరు 2021 (16:32 IST)

సీఎం జగన్ హత్యకు కుట్ర జరుగుతోంది: వైసిపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హత్యకు కుట్ర జరుగుతోందని అనంతపురం జిల్లా రాప్తాడు వైసిపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేసారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని హత్య చేసైనా అధికారంలోకి రావాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోందన్న ఆయన, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. జగన్ మోహన్ రెడ్డి గాల్లోనే కలిసిపోతారని తీవ్ర వ్యాఖ్యలు చంద్రబాబు చేసారనీ, ఇటీవలి కాలంలో ఇలాంటి వ్యాఖ్యలు తెదెపా తరచూ చేస్తోందన్నారు.

 
అంతేకాదు... ఎమ్మెల్యేలు ముగ్గుర్ని చంపితే రూ. 50 లక్షలు రివార్డు ఇస్తానంటూ మల్లాది వాసు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలను చంద్రబాబు నాయుడు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.

 
ఎలాగైనా సీఎం జగన్ మోహన్ రెడ్డిని జైలుకు పంపి అధికారంలోకి రావాలని తెదేపా కుట్ర చేస్తోందని ప్రకాష్ అన్నారు. కాగా వైసిపి ఎమ్మెల్యే వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరి దీనిపై తెదేపా ఎలా స్పందిస్తుందో చూడాలి.