ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 11 డిశెంబరు 2021 (12:41 IST)

జ‌వాన్ సాయితేజ కుటుంబానికి సీఎం జ‌గ‌న్ ఆర్థిక సాయం

తమిళనాడు రాష్ట్రంలో ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన జవాన్ సాయి తేజ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. సీఎం జగన్ రూ.50 లక్షలు ఆర్థికసాయం ప్రకటిస్తూ,  నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా సీఎంవో కార్యాలయం ప్రకటించింది.
 
 
మరోవైపు సాయితేజ భౌతిక కాయాన్ని గుర్తించిన ఆర్మీ అధికారులు స్వగ్రామానికి తరలిస్తున్నారు. ఢిల్లీ నుంచి కోయంబత్తూరుకు ప్రత్యేక విమానంలో సాయి తేజ భౌతిక కాయాన్ని అధికారులు తరలిస్తున్నారు. కోయంబత్తూరు మీదుగా బెంగళూరుకు, అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా ఎగువ రేగడ పల్లి గ్రామానికి సాయి తేజ భౌతికకాయాన్ని తరలించనున్నారు. అధికార సైనిక లాంఛనాలతో అంత్యక్రియల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో స్వగ్రామానికి సాయి తేజ భౌతికకాయం చేరే అవకాశం ఉంది. 
 
 
అయితే జ‌వాను భౌతిక కాయాన్ని బెంగళూరులోని సైనిక ఆస్పత్రిలోనే రాత్రికి ఉంచి రేపు ఉదయం తమకు అప్పగించాలని సాయి తేజ కుటుంబ సభ్యులతో సహా తమ్ముడు మహేష్ బాబు ఆర్మీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. సాయితేజ దుర్మ‌ర‌ణం దేశ ప్ర‌జ‌లంద‌రినీ క‌న్నీటితో ముంచెత్తింది. ముఖ్యంగా రేగ‌డ‌ప‌ల్లి వాసులు తీవ్రంగా విషాదంలో మునిగిపోయారు.