శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 7 డిశెంబరు 2021 (11:31 IST)

సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం వైఎస్‌ జగన్‌ విరాళం

దేశ స‌మ‌గ్ర‌త‌కు, సౌభాతృత్వానికి ప్ర‌తీక అయిన సాయుధ ద‌ళాల దినోత్స‌వం నేడు. దీనిని ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి సైనికాధికారులు లాంఛ‌నంగా ఏర్పాట్లు చేశారు. సైనిక సంక్షేమ‌శాఖ ఉన్న‌తాధికారులు సాయుధ దళాల పతాక దినోత్సవం సంద‌ర్భంగా నిధిని స‌మీక‌రిస్తున్నారు. ఈ నిధి వ‌సూళ్ళ‌ను లాంఛ‌నంగా సీఎం క్యాంప్ కార్యాల‌యం నుంచి ప్రారంభించారు. 
 
 
ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను ఏపీ సైనిక్‌ వెల్‌ఫేర్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ వి.వెంకటరెడ్డి, విఎస్‌ఎమ్‌ (రిటైర్డ్‌) మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయ‌న‌తోపాటు సైనిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ముఖ్య‌మంత్రిని క‌లిశారు. వారంతా సీఎం జ‌గ‌న్ కి జ్ఞాపిక అందజేశారు. దీని ప్ర‌త్యేక‌త‌ను, సాయుధ ద‌ళాల ప‌తాక దినోత్స‌వం విశేషాల‌ను బ్రిగేడియర్‌ వి.వెంకటరెడ్డి సీఎం జ‌గ‌న్ కు వివ‌రించారు. 
 
 
ఈ కార్యక్రమంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, సైనిక సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వి.వెంకట రాజారావు, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ భక్తవత్సల రెడ్డి, సూపరింటెండెంట్‌ ఈశ్వరరావు ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.