సంబంధిత వార్తలు
- ధోని ఫ్యాన్స్ సెలబ్రేషన్ చేసుకొనే న్యూస్: టీ20 ప్రపంచకప్ 2021లో మహీ!
- యుద్ధం సైనికుల అత్యున్నత త్యాగాలకు నిలువుటద్దం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
- కియాను సందర్శించిన ఏపీఐఐసీ ఛైర్మెన్ మెట్టు గోవిందరెడ్డి
- వాళ్ల కష్టాలు తెలిసిన తర్వాత బాధేసింది - సీటీమార్ గురించి గోపీచంద్
- బోర్డుకు తలవంపులు తెచ్చే పనులు చేస్తారా.. కోహ్లీ - శాస్త్రిలపై ఫైర్
భారత సాయుధ బలగాల్లో అమ్మాయిలు
భారత సాయుధ బలగాల్లో చేరడానికి అమ్మాయిలకు అవకాశం వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ), నేవల్ అకాడమీ (ఎన్‌ఏ) ల్లో ప్రవేశం, శిక్షణ కోసం అమ్మాయిలను కూడా అనుమతించనున్నట్టు పేర్కొంది.
ఇప్పటివరకు ఇంటర్ చదివిన, పెళ్లికాని అబ్బాయిలు మాత్రమే వీటిలో ప్రవేశానికి అర్హులు. అయితే ఈ నిబంధన వల్ల అమ్మాయిలు అవకాశాలు కోల్పోతున్నారని, ఇది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొంటూ కుష్ కల్రా అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అమ్మాయిలను కూడా ఎన్‌డీఏ, ఎన్‌ఏ పరీక్షలకు అనుమతించేలా యూపీఎస్సీని ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. గత నెలలో దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఆయా పరీక్షలకు అమ్మాయిలను అనుమతించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయంపై బుధవారం సుప్రీంకోర్టులో మళ్లీ విచారణ జరిగింది.
అమ్మాయిలను ఎన్‌డీఏ, ఎన్‌ఏ విభాగాల్లోకి అనుమతించాలని డిఫెన్స్ ఫోర్సె్‌సకు చెందిన ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్టు ఈ సందర్భంగా కేంద్రం కోర్టుకు తెలిపింది.
తర్వాతి కథనం
