ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (07:13 IST)

వచ్చేనెల 7 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు

వచ్చేనెల 7 నుంచి 15వ తేదీ వరకు కొవిడ్‌ నిబంధనల నడుమ బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈసారి ఉత్సవాల్లో దుర్గమ్మ దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి కుంకుమతో పాటు అమ్మవారి ప్రతిమ ఉన్న డాలర్‌ అందజేయాలని నిర్ణయించినట్టు దుర్గగుడి పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు తెలిపారు.

క్యూలైన్లు, తాగునీటి సరఫరా, ఘాట్లలో జల్లుస్నానాలు, తాత్కాలిక మరుగుదొడ్లు తదితర పనులకు సుమారు రూ.2కోట్లతో అంచనాలకు పాలక మండలి ఆమోదం తెలిపింది.