గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (06:51 IST)

విద్యార్థులకు ఆయుష్ ద్వారా కోవిడ్ నివారణ మందు

రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభం కావటంతో విద్యార్థులకు కోవిడ్ జాగ్రత్తలతో పాటు ఆయుష్ శాఖ ద్వారా మందు పంపిణీ చేసెందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రాజెక్ట్ అమృత్ పేరుతో నిర్వహించే ఈ పథకంలో భాగంగా పంపిణీ చేస్తున్న "ఆర్సెనిక్ ఆల్బమ్ 30సి" మందు పూర్తిగా ఉచితంగా అందజేయనున్నారు.

ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 17 మండలాల్లో రెసిడెన్సియల్, కే జి బి వి లలో పంపిణీ చేసి మంచి ఫలితాలు సాధించటం జరిగింది.

ప్రస్తుతం ఎంపిక చేసిన తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ గా ఎన్ జి ఓ సహకారంతో మందును విద్యార్థులకు పంపిణీ చేసెలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్య కమిషనర్ ను ఆదేశించినట్లు తెలిపారు.