శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (13:29 IST)

దీపావళి బోనస్_ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా కేంద్రం దీపావళి బోనస్ ప్రకటించింది. కానీ ఇది అందరికీ కాదు. ఇది పారా మిలిటరీ ఉద్యోగులకు మాత్రమే అని కేంద్రం స్పష్టంగా తెలిపింది. వివరాల్లోకి వెళితే.. పారా మిలిటరీ ఉద్యోగులకు దీపావళి బోనస్‌ని కేంద్రం ఇవ్వనుంది. 
 
అయితే వీరికి 30 రోజుల దీపావళి బోనస్ అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అంది. ఇక ఇది ఎవరికి వర్తిస్తుంది అనేది చూస్తే.. ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ లభించని గ్రూప్-సీ, గ్రూప్-బీ నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇది వర్తిస్తుంది.
 
ఇదిలా ఉంటే 2021 మార్చి 31 నాటికి సర్వీసులో ఉన్న వారికి మాత్రమే బోనస్ వస్తుంది. అలానే 2020-21లో ఆరు నెలలు సర్వీస్‌లో ఉన్నా కూడా ఈ బోనస్ డబ్బులని పొందొచ్చు. ఇది ఇలా ఉంటే కేంద్రం ప్రభుత్వం ఇటీవలనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పలు రకాల బెనిఫిట్స్ ని ఇవ్వడం జరిగింది.
 
డియర్‌నెస్ అలవెన్స్ పెరుగుదల, డీఆర్ పెంపు ఇవ్వడం మనం చూసాం. అయితే రానున్న రోజుల్లో మళ్లీ డీఏ పెంపు కూడా వుండే అవకాశం వుంది. మరోసారి డీఏ మళ్లీ 3 శాతం పెరగొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే త్వరలోనే పీఎఫ్ వడ్డీ డబ్బులు కూడా ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాలో పడతాయి.