మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (18:15 IST)

కరోనా టీకా వేయించుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం... ఎక్కడ?

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు ముమ్మరంగా కృషి చేస్తున్నాయి. ఇందులోభాగంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వేగిరం చేశాయి. ఇలాంటి రాష్ట్రాల్లో పుదుచ్చేరి ఒకటి. 
 
అయితే, అనారోగ్య సమస్యల కారణంగా, ఇతర భయాల కారణంగా టీకాలు వేయించుకునేందుకు మొగ్గు చూపడం లేదు. ఇలాంటి వారిలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇలాంటి వారికి పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తేరుకోలేని షాకిచ్చారు. 
 
కరోనా టీకా వేసుకోని ఉద్యోగుల జీతంతోపాటు దీపావళి బోనస్ కూడా ఇవ్వబోమని ప్రకటించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికే ఈ రెండూ లభిస్తాయని స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్‌పై అవగాహన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ ప్రకటన చేశారు. 
 
టీకా ఆవశ్యకతను వివరించేలా సైకిల్ ర్యాలీని ఆమె ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సైనికులు పిలుపునిచ్చారు. రాజ్ నివాస్ ఆవరణ నుంచి ఈ ర్యాలీ ప్రారంభమైంది. దీన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ జెండా ఊపి ఆరంభించారు.