శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 14 జూన్ 2021 (16:55 IST)

పాలసీ హోల్డర్లకు అత్యధికంగా 867కోట్ల రూపాయల బోనస్‌ను ప్రకటించిన ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌

ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 2021 ఆర్ధిక సంవత్సరం కోసం అర్హులైన పార్టిస్పేటింగ్‌ పాలసీహోల్డర్లకు 867కోట్ల రూపాయల వార్షిక బోనస్‌ను ప్రకటించింది. ఇప్పటి వరకూ కంపెనీ ప్రకటించిన  అత్యధిక బోనస్‌ ఇది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 10% అత్యధిక బోనస్‌ను ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ప్రకటించింది.
 
మార్చి 31,2021 నాటికి అమలులో ఉన్న పార్పిస్పేటింగ్‌ పాలసీలన్నీ కూడా ఈ బోనస్‌ అందుకోవడానికి అర్హత కలిగి ఉంటాయి. ఈ మొత్తాలను పాలసీ హోల్డర్ల ప్రయోజనాలకు జోడిస్తారు. ఈ బోనస్‌ ప్రకటన ద్వారా దాదాపు 9.8 లక్షల మంది పార్టిస్పేటింగ్‌ పాలసీ హోల్డర్లు ప్రయోజనం పొందుతారు. తద్వారా వారి దీర్ఘకాలిక ఆర్ధిక లక్ష్యాలనూ చేరుకోగలరు.  కంపెనీ యొక్క పార్టిస్పేటింగ్‌ పాలసీహోల్డర్ల నిధులకు సృష్టించబడిన లాభాల వాటా బోనస్‌. ఈ మొత్తాలను పాలసీహోల్డర్ల గ్యారెంటీడ్‌ మెచ్యూరిటీ ప్రయోజనాలకు జోడిస్తారు. తద్వారా వారి కార్పస్‌ను సైతం వృద్ధి చేసుకోగలరు.
 
కంపెనీ బోనస్‌ను ప్రకటించడం ఇది వరుసగా 15వ సంవత్సరం. వినియోదారుల లక్ష్యిత పథకాలు, దీర్ఘకాలిక పెట్టుబడుల విధానంతో పాలసీ హోల్డర్లకు అత్యున్నతంగా మార్చతగిన రాబడులను అందించాలనే కంపెనీ ప్రయత్నాలను ఇది ప్రతిబింబిస్తుంది. కంపెనీ యొక్క సమర్థవంతమైన పెట్టుబడి విధానం తమ పోర్ట్‌ఫోలియోలో జీరో డీఫాల్ట్స్‌కు భరోసా అందిస్తుంది. కంపెనీ కార్యకలాపాలు ఆరంభించిన నాటి నుంచి విభిన్న మార్కెట్‌ల వ్యాప్తంగా ఇది కనిపిస్తుంది. మార్చి 31, 2021 నాటికి 96.8% ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ పోర్ట్‌ఫోలియోలను సావరిన్‌ లేదా ఏఏఏ రేటెడ్‌ పేపర్‌లలో పెట్టుబడులు పెట్టారు.
 
ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈవొ శ్రీ ఎన్‌ ఎస్‌ కణ్ణన్‌ మాట్లాడుతూ, ‘‘కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా  2021 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక బోనస్‌ను కంపెనీ ప్రకటించింది. మాకు సంతృప్తిని అందించిన అంశమేమిటంటే కంపెనీ కార్యకలాపాలు ఆరంభించిన 20వ సంవత్సరంలో ఇది జరుగుతుండటం. వినియోగదారులపై మేము సారించిన దృష్టి, మా నిబద్ధత, ఊహాతీత సవాళ్లను కూడా అధిగమించే మా సామర్ధ్యంకు ఇది ప్రతీకగా నిలుస్తుంది. ఈ సంక్షోభ వాతావరణంలో కూడా మమ్మల్ని నడిపిస్తున్నది, సున్నితత్త్వంతో  మా వినియోగదారుల సుదీర్ఘపొదుపు అవసరాలు తీర్చడంతో పాటుగా వారికి తగిన రక్షణను సైతం అందించడం ద్వారా ధృడమైన సంస్థను నిర్మించాలనే మా లక్ష్యం’’ అని అన్నారు.
 
ఈ కంపెనీ యొక్క పూర్తి శ్రేణి సంప్రదాయ లాంగ్‌ టర్మ్‌ ఉత్పత్తులు వినియోగదారులకు మూలధన భద్రత మరియు స్థిరమైన రాబడులను అందిస్తుంటాయి. లైఫ్‌ కవర్‌ వారికి అవసరమైన ఆర్ధిక భద్రతను సైతం కుటుంబానికి అందిస్తుంది. కంపెనీ యొక్క వినూత్నమైన పార్టిస్పేటింగ్‌ ఉత్పత్తి లక్ష్య, వైవిధ్యమైన వినియోగదారుల అవసరాలను దీర్ఘకాల సంపద సృష్టి మొదలు నిర్థిష్టమైన ఆదాయ అవసరాల వరకూ జీవితంలో వివిధ దశలలో అందిస్తుంది.