బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 30 డిశెంబరు 2021 (23:18 IST)

జగన్ సర్కార్‌ని గద్దె దించడానికి వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన, వామపక్షాలు కలిసి పోటీ

ఏపీలో అవినీతి పాలన చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని సాగనంపేందుకు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, వామపక్షాలు అన్నీ కలిసి పోటీ చేస్తాయని మాజీ శాసనమండలి చైర్మన్, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.


పశ్చిమ గోదావరిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... సామాన్యులకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయిందనీ, ఇక్కడ బీహార్ తరహా పాలన సాగుతోందని విమర్శించారు.

 
సామాన్యుల భద్రతకు భరోసా కల్పించగల ప్రభుత్వం తెదేపాతోనే సాధ్యమన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో తెదేపా-జనసేన-వామపక్షాలు కలిసి పోటీ చేయాల్సిన ఆవశ్యకత వుందని చెప్పారు.