1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Shariff Mohammed Ahmed talk about YSRCP Govt Rule

రాష్ట్రంలో పరిస్థితులు బీహార్‌ను తలపిస్తున్నాయ్... కలిసి పోటీ చేస్తాం : షరీఫ్

Shariff Mohammed Ahmed
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు బీహార్ రాష్ట్రాన్ని తలపిస్తున్నాయని టీడీపీ సీనియర్ నేత, శాసనమండలి మాజీ స్పీకర్ షరీఫ్ మహ్మద్ అహ్మద్ ఆరోపించారు. సువర్ణపాలన అందిస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అటవిక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్లులో జరిగిన టీడీపీ ఆత్మగౌరవ సభ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 
 
రాష్ట్రంలో పరిస్థితులు బీహార్‌ను తలపిస్తున్నాయని ఆరోపించారు. దుశ్చర్యలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందన్నారు. వైకాపా ప్రభుత్వం ఆరాచకంగా, అసమర్థంగా వ్యవహిస్తూ అటవిక పాలన సాగిస్తుందని ఆరోపిచారు. అదేసమయంలో వచ్చే 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేస్తాయని షరీఫ్ చెప్పారు. 
తర్వాతి కథనం
జనవరి 1, 2022 నుంచి పెరగనున్న సిలిండర్ ధరలు