1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (13:11 IST)

బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతాను సైబర్ హ్యాకర్లు ఖాతాను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని జేపీ నడ్డా స్వయంగా వెల్లడించారు. హ్యాక్ చేసిన తర్వాత రష్యా, ఉక్రెయిన్ల కోసం క్రిప్టో కరెన్సీ రూపంలో విరాళాలు కోరుతూ ఓ ట్వీట్ చేశారు. 
 
"రష్యా ప్రజలతో నిలబడండి. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ విరాళాలు సేకరిస్తున్నాను. బిట్ కాయిన్, ఎథెరియం" అంటూ అగంతకులు ట్వీట్ చేశారు. దీంతో పాటు ఉక్రెయిన్ ప్రజలతో నిలబడండి. ఇపుడు క్రిప్టో కరెన్సీ విరాళాలు అంగీకరిస్తున్నాను అంటూ హిందీలో కూడా ట్వీట్ చేశారు. దీంతో పాటు పలు కామెంట్లను ఆయన వరుసగా చేశారు. దీంతో తన ఖాతా హ్యాక్ అయినట్టు గుర్తించిన జేపీ నడ్డా అధికారికంగా వెల్లడించారు. 
 
దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ వర్గాలు చర్యలు ప్రారంభించాయి. ఆ వెంటనే దానికి సంబంధించిన అన్ని ట్వీట్లను తొలగించారు. కొద్దిసేపు తర్వాత జేపీ నడ్డా ఖాతాను పునరుద్ధరించారు.