1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Strong earthquake in southwest China kills 30

చైనా కాంగ్ డింగ్ సిటీకి నైరుతి దిశగా భూకంపం - 30 మంది మృత్యువాత

earthquake
పొరుగు దేశమైన చైనాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూప్రకంపనల ధాటికి 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. భారీ సంఖ్యలో గృహాలు నేలమట్టమయ్యాయి. ఈ భూప్రకంపనలు భూకంప లేఖినిపై దాదాపు 6.6గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ కారణంగా అనేక గృహాలు నేలమట్టమయ్యాయి. 
 
ఈ భూకంప కేంద్రానికి సచువాన్ ప్రావిన్స్‌ కాంగ్ డింగ్ నగరానికి నైరుతి దిక్కున 43 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపింది. ఈ భూ ప్రకంపనలు రాజధాని ప్రాంతమైన చెంగ్డు నగరంలో కూడా కనిపించాయి. ఈ ప్రాంతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్డౌన్ అమలవుతుంది. 
 
ఈ పరిస్థితుల్లో భూకంపం సంభవించడంతో దాదాపు 10 వేల మంది వరకు ప్రభావితులయ్యారని చైనా ప్రభుత్వ అధికారిక టీవీ వెల్లడించింది. విద్యుత్, టెలీకమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని చైనా ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
హాయిగా నిద్రపోయింది.. రూ.5 లక్షల రివార్డు గెలుకుంది.. ఎక్కడ?