రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదాపైనే..
తమ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే, ఆయన చేసే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఫైలుపైనే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రకటించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా (ఎస్సీఎస్) కల్పిస్తామని ఆయన ప్రకటించారు.
మంగళవారం కర్నూలులో పార్టీ సభ్యులతో మాట్లాడిన మాజీ మంత్రి.. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాటకు అనుగుణంగా ప్రజల మద్దతుతో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ఏపీ ప్రత్యేక హోదా విషయంలో పచ్చజెండా ఊపుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితి కాబోదని, వీఆర్ఎస్ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా సాగుతోందని చెప్పారు.