మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2022 (23:09 IST)

పబ్ కల్చర్‌పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

pub culture
పబ్ కల్చర్‌పై మరోసారి హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పబ్స్ నిర్వహణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 
 
సోమవారం నుంచి రాత్రి 10 దాటితే పబ్స్‌లో ఎటువంటి సౌండ్ ఉండకూడదని హైకోర్టు పేర్కొంది. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పోల్యుషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతినిచ్చింది.
 
రోజు రోజుకీ హైదరాబాద్‌లో పబ్ కల్చర్ పెరుగుతోన్న సంగతి తెలిసిందే. పలువురు పబ్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా పబ్బులు నడపడంతో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.