సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (09:28 IST)

రెబెల్ స్టార్‌కు అభిమానుల హృదయాల్లో సుస్థిరస్థానం : సీఎం కేసీఆర్

kcrao
సీనియర్ సినీ నటుడు కృష్ణంరాజుకు సినీ అభిమానుల, ప్రేక్షకు మనస్సుల్లో సుస్థిర స్థానం ఉంటుందని తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం మృతి చెందిన కృష్ణంరాజు మృతిపై సీఎం కేసీఆర్ తన సంతాప సందేశాన్ని వ్యక్తం చేశారు. 
 
కృష్ణంరాజు మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. ఎంపీగా, కేంద్రమంత్రిగా పాలనారంగం ద్వారా ప్రజలకు సేవలు అందించిన ఆయన మృతి విచారకరమన్నారు. కృష్ణంరాజు తన 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో విలక్షణ నటనాశైలితో రెబల్ స్టార్‌గా అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. 
 
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 83 సంవత్సరాల కృష్ణంరాజు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ తెల్లవారు జామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు.