గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2022 (19:32 IST)

ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరనాయుడు కన్నుమూత - బాబు సంతాపం

sundar naidu
ప్రముఖ పారిశ్రామికవేత్త, బాలాజీ హేచరీస్‌ అధినేత ఉప్పలపాటి సుందరనాయుడు మృతి చెందారు. చిత్తూరు జిల్లాకు చెందిన సుందరనాయుడు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం కన్నుమూశారు. హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. 
 
ఆయన మరణవార్త తెలుసుకున్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన సంతాప సందేశాన్ని వెల్లడించారు."సుందరనాయుడు మరణం విచారకరం. రైతు ఆర్థిక సమస్యలకు పరిష్కారంగా కోళ్ళ పెంపకాన్ని ప్రోత్సహించి, బాలాజీ హేచరీస్‌ స్థాపనతో పౌల్ట్రీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టి, వేల మందికి ఆయన ఉపాధిని ఇచ్చారు. సుందరనాయుడు మరణం పౌల్ట్రీ రంగానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.