శనివారం, 14 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2022 (08:38 IST)

కొన్ని కుటుంబాల చేతిలో టాలీవుడ్ బందీగా ఉంది : అమలాపాల్

amalapaul
తెలుగు చలనచిత్ర పరిశ్రమ కొన్ని కుటుంబాల చేతిలో బందీగా ఉందని సినీ నటి అమలాపాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె తెలుగులో అతి తక్కువ సినిమాలే చేసింది. అలాంటి అమలాపాల్ టాలీవుడ్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్లను గ్లామర్ పాత్రలకే పరిమితం చేస్తారని ఆరోపించారు. 
 
తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటి నుంచి టాలీవుడ్ కొన్ని కుటుంబాల చేతిలోనే ఉందన్న విషయం తనకు అర్థమైందన్నారు. ఆ కుటుంబాలే చిత్రపరిశ్రమపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయన్న విషయాన్ని గుర్తించానని చెప్పారు.
 
వారు తీసే సినిమాలు భిన్నంగా ఉండేవని, వారి ప్రతి సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్లు ఉండేవారన్నారు. వారిని గ్లామర్‌గా చూపిస్తూ లవ్స్ సీన్స్, పాటలకు మాత్రమే పరిమితం చేసేవారని చెప్పారు. ఆ సినిమాలు చాలా కమర్షియల్‌గా ఉండేవన్నారు. అందుకనే తాను తెలుగు చిత్రపరిశ్రమకు దగ్గర కాలేక పోయినట్టు వివరించారు. 
 
పైగా, కెరీర్ ప్రారంభంలో అడిషన్స్, మీటింగులు వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు చెప్పారు. అదేసమయంలో తమిళం సినీ కెరీర్ ప్రారంభించడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. కానీ, కెరియర్ ప్రారంభంలో చేసిన రెండు చిత్రాలు ఇప్పటికీ విడుదల కాలేదన్నారు. ఆ తర్వాత నటించిన "మైనా" చిత్రం విడుదలై మంచి విజయాన్ని అందుకుందన్నారు. అలాగే, తాజాగా "కెడావర్" చిత్రం సినిమాలో నటించగా, అది ఓటీటీలో విడుదలైంది.