సోమవారం, 24 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2022 (10:10 IST)

పెద్ద హీరోలతో రొమాన్స్ చేసినప్పుడు ఇబ్బందిపడ్డాను.. అమలాపాల్

amala paul
స్టార్ హీరోయిన్ అమలాపాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఆమె ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్పుకొచ్చింది. ఇటీవలే కడవర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఒకానొక దశలో సినిమాలు మానేసే పరిస్థితి వచ్చిందంటూ ఎమోషనల్ అయ్యింది.

"కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు అనుభవించాను. ముఖ్యంగా పెద్ద హీరోలు, నాకన్నా వయసులో పెద్దవారైనా వారితో రొమాన్స్ చేసినప్పుడు ఎంతో ఇబ్బందిపడ్డాను. సక్సెస్ కోసం ఇంతగా పాకులాడుతున్నానా అని అనిపించింది. కానీ, వారితో నటించడం వలన ఎన్నో నేర్చుకున్నాను. ఇక చాలాసార్లు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనిపించింది. ఇక ఆ సమయంలోనే మా నాన్నగారు మృతి చెందారు. ఎన్నో బయలు నన్ను వెంటాడాయి. కానీ అన్నింటిని తట్టుకొని నిలబడ్డాను. పోరాడి ఇక్కడి వరకు వచ్చాను” అంటూ చెప్పుకొచ్చింది.