ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 జులై 2022 (23:02 IST)

అమలాపాల్‌కు రెండో పెళ్లి.. నిజమేనా?

Amala Paul
ఇద్దరమ్మాయిలతో ఫేమ్ అమలాపాల్ గురించి తెలిసిందే.  దక్షిణాదిన తెలుగు, తమిళం, మలయాళం వంటి భాషల్లో కనిపించిన అమలాపాల్ కోలీవుడ్ దర్శకుడు విజయ్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి బంధంతో ఒకటైన ఈ జంట కొన్ని నెలల వ్యవధిలోనే విడాకులతో విడిపోయారు. 
 
ఈ విధంగా విడాకులు తీసుకున్న అమలాపాల్ అనంతరం సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ అభిమాని నుంచి నటి అమలాపాల్‌కు వింత ప్రశ్న ఎదురయింది. ఈ సందర్భంగా నెటిజన్ ప్రశ్నిస్తూ.. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి అని తన పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చారు.
 
దీనిపై అమలాపాల్ మాట్లాడుతూ ప్రస్తుతం తాను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో లేనని తెలిపారు. ప్రస్తుతం తనని తాను అర్థం చేసుకునే పనిలో ఉన్నానంది. తనను తాను మార్చుకుని ఉన్నతంగా ఎదగాలని బదులిచ్చింది. 
 
కనుక తాను పెళ్లి చేసుకోబోయే వాడికి ఎలాంటి అర్హతలు ఉండాలో ఇప్పుడే చెప్పలేనని ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెబుతానని సమాధానం చెప్పారు. ఈ సమాధానాన్ని బట్టి అమలాపాల్ రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా వున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.