ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జూన్ 2022 (14:27 IST)

అచ్చతెలుగమ్మాయి అంజలి పుట్టిన రోజు.. పద్నాలుగేళ్లుగా హీరోయిన్‌గా..?

anjali
అచ్చతెలుగమ్మాయి అంజలి పుట్టిన రోజు నేడు. ఈమెకు తెలుగు సినిమాల కంటే.. కోలీవుడ్ బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో పాపులర్ అయింది. ఆ తర్వాత ఇక్కడ కొన్ని సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంది. 
 
కానీ అంజలి కోరకున్న సక్సెస్ మాత్రం దక్కలేదు. ఈ రోజు అంజలి బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె కొన్ని గురించి కొన్ని నిజాలు.. 16 జూన్ 1986లో రాజోలులో అంజలి జన్మించింది. హీరోయిన్ కాకముందు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో అంజలి పనిచేసింది. చదువు కోసం చెన్నైకి వెళ్లిన అంజలి. అక్కడ కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా నటించింది.  
 
2006లో ఫోటో అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసింది. తెలుగులో రెండు చిత్రాలు చేసిన తగిన గుర్తింపు మాత్రం లభించలేదు. ఆ తర్వాత కట్రదు తమిళ్ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్‌లో చిన్న హీరోలతో నటించింది. మంచి నటనతో మంచి పేరు కొట్టేసింది.  
 
తమిళంలో తొలి చిత్రంతోనే ఫిల్మ్‌ఫేర్ బెస్ట్ డెబ్యూ అవార్డు కైవసం చేసుకుంది.  తమిళంతో పాటు కన్నడ, మలయాళ సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. 
 
తెలుగులో వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె’ చెట్టు’ సినిమాతో మళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. 
 
ఆ తర్వాత రవితేజతో బలుపు, వెంకటేష్‌తో మరోసారి జతకట్టింది. బాలయ్య సరసన "డిక్టేటర్" మూవీలో నటించింది. అటు తర్వాత సరైనోడు సినిమాలో బ్లాక్ బస్టర్ పాటకు ఐటెం సాంగ్ చేసింది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్ధం సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమాలో ముఖ్యపాత్రలో నటించింది. 
 
యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలకు బెస్ట్ ఆప్షన్‌గా అంజలి మారింది. గత పద్నాలుగేళ్లుగా హీరోయిన్‌గా కెరీర్ కొనసాగిస్తున్న అంజలికి మంచి హిట్స్ ఇకనైనా రావాలని కోరుకుంటూ బర్త్ డే విషెస్ చెప్తాం. హ్యాపీ బర్త్ డే అంజలి.