ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 జూన్ 2022 (17:39 IST)

హీరో సూర్యకు అరుదైన గౌరవం

surya
కోలీవుడ్ హీరో సూర్యకు అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ అకాడెమీ నుంచి ఆహ్వానం అందింంది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ టీమ్‌లో చేరాలంటూ ఆయనకు అహ్వానం అందింది. ఈ మేరకు ఆస్కార్ జ్యూరీ పంపించింది. 
 
ఆస్కార్ అవార్డుల కమిటీలో ఉండేందుకు మొత్తం 397 మందికి అహ్వానాలు అందాయి. మంగళవారం 2022 ఆస్కార్ అకాడెమీలో చేరే సభ్యుల జాబితాను విడుదల చేశారు. ఇందులో బాలీవుడ్ నటి కాజోల్‌తో పాటు కోలీవుడ్ నుంచి సూర్య పేర్లు ఆ జాబితాలో ఉన్నాయి. 
 
ఇప్పటివరకు ఆస్కార్ అకాడెమీలో చేరిన సౌత్ ఇండియన్ హీరో సూర్యనే కావడం గమనార్హం. కాగా, మార్చి 12వ తేదీ 2023న 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలను నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.