మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 15 జూన్ 2022 (11:11 IST)

సెంటిమెంట్ ప్రధానంగా మాతృదేవోభవ విడుద‌ల‌కు సిద్ధం

Matrudevobhava poster
Matrudevobhava poster
ఆ రోజుల్లో వచ్చిన మాతృదేవోభవ సినిమా ఏ రేంజ్‌లో హిట్టయిందో మనందరికీ తెలుసు. చిన్న పెద్దా అనే తేడా లేకుండా అంతా ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. అన్ని వర్గాల ఆడియన్స్ నీరాజనం పలికారు. ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల చేత థియేటర్స్ లోనే కన్నీళ్లు పెట్టించాయి. సంవత్సరాల తరబడి ఈ సినిమా థియేటర్స్‌లో ఆడటమే గాక ప్రతి ఒక్క ఫ్యామిలీని సినిమా హాలుకు తీసుకొచ్చింది. అయితే ఇన్నేళ్లకు మళ్ళీ అదే రకమైన సెంటిమెంట్ కంటెంట్ తోనే అదే టైటిల్ మాతృదేవోభవ తీసుకొని మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 
 
శ్రీ వాసవి మూవీస్ బ్యానర్‌పై అదే మాతృదేవోభవ టైటిల్‌తో కొత్త సినిమా రాబోతోంది. దీనికి ఓ అమ్మ కథ అనే ట్యాగ్ లైన్ ఎంచుకొని బలమైన ఫ్యామిలీ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. జులై 1న ఘనంగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో సీనియర్ నటి సుధ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. ఆమె భర్తగా సీనియర్ హీరో సుమన్ నటిస్తున్నారు. భర్త ప్రమాదంలో చనిపోవడంతో తన పిల్లలను సుధ ఏ విధంగా పెంచిందనే కంటెంట్ తీసుకొని ఎమోషనల్‌ ఎలిమెంట్స్ జొప్పిస్తూ ఈ సినిమా రూపొందిస్తున్నారు. MS రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రానికి కె . హరనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పతాంజలి శ్రీను, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు.
 
సెంటిమెంట్ ప్రధానంగా రాబోతున్న ఈ చిత్రానికి KJS రామా రెడ్డి కథ అందించగా శ్రీ వాసవి మూవీస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. చోడవరపు వెంకటేశ్వర రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరుధూరి రాజా డైలాగ్స్ రాశారు. డైమండ్ వెంకట్ ఫైట్స్ కంపోజ్ చేశారు. అనంత శ్రీరాం, పాండురంగ రావు, దేవేందర్ రెడ్డి లిరిక్స్ రాశారు. ఈ చిత్రంలో సుధ, సుమన్, రఘు బాబు, పోసాని కృష్ణ మురళి లాంటి ఫేమస్ తారాగణం పాల్గొంటుండటం విశేషం.  
 
నటీనటులు  
సుధ, సుమన్, రఘు బాబు, పోసాని కృష్ణ మురళి, సూర్య, చమక్ చంద్ర, జెమిని సురేష్, శ్రీహర్ష, సత్యశ్రీ, సోనియా చౌదరి, కీర్తి, అపూర్వ, జబర్దస్త్ అప్పారావు, పీటీ మాధవ్. 
 
సాంకేతిక వర్గం
కథ: k.j.s.రామా రెడ్డి
బ్యానర్: శ్రీ వాసవి మూవీస్ బ్యానర్‌
 స్క్రిన్ ప్లే - దర్శకత్వం,:  కె  హరనాథ్ రెడ్డి
నిర్మాత: చోడవరపు వెంకటేశ్వర రావు
ఫైట్స్: డైమండ్ వెంకట్ 
పీఆర్వో: సాయి సతీష్, పర్వతనేని రాంబాబు