7 డేస్ 6 నైట్స్ ట్రైలర్‌కి అనూహ్య స్పందన
Sumant Ashwin, Mehr Chahal
ఎం.ఎస్. రాజు దర్శకునిగా 'డర్టీ హరి' తో గతేడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. తాజాగా, మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఆయన దర్శకత్వం వహించిన మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ '7 డేస్ 6 నైట్స్' జూన్ 24న విడుదల కి సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త ట్రైలర్ కి అద్భుతమైన స్పందన రావడంతో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. సరికొత్త ట్రీట్మెంట్ తో, విజువల్స్ తో ట్రైలర్ లో సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్ తో పాటు రోహన్, క్రితిక శెట్టి మరో జంటగా కనిపించారు. కామెడీ తో యూత్ ఫుల్ కంటెంట్ ని కలిపి పూర్తిగా ఆకట్టుకునే విధంగా చిత్రం ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
ఈ సందర్భంగా హీరో, నిర్మాత సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ "ఈ చిత్రాన్ని హైదరాబాద్, బెంగళూరు, ఉడిపి, గోకర్ణ, గోవాలలో పరిసరాల్లో మునుపేనాడు చిత్రీకరించని చోట్లలో తీసాం. మా కొత్త ట్రైలర్ కి అందుతున్న అనూహ్య స్పందన కి చాలా సంతోషంగా ఉంది. ఆద్యంతం నవ్వించే కవ్వించే సన్నివేశాలతో అందరికీ నచ్చే యూత్ సినిమా గా ప్రేక్షకుల ముందుకి ఈ నెల 24న థియేటర్లలో విడుదల చేయనున్నాం" అని అన్నారు.
దర్శకుడు ఎంఎస్ రాజు మాట్లాడుతూ " మా కొత్త ట్రైలర్ కి లభించిన స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కచ్చితంగా డర్టీ హరి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత వచ్చే నా చిత్రం పై ఉన్న అంచనాలని అందుకుంటాం అని నమ్మకం ఉంది. ఈ చిత్రం కేవలం యూత్ కి మాత్రమే కాక అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది. హీరో సుమంత్ అశ్విన్ ఈ చిత్రం లో తన పాత్ర కోసం తనని తను మార్చుకుని పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి నటించారు. హీరోయిన్ మెహర్ చాహల్ మరో జంట రోహన్, క్రితికా శెట్టి అద్భుతంగా నటించి తమ పాత్రలకి పూర్తి న్యాయం చేసారు. ఈ నెల జూన్ 24న మా చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నాం" అని అన్నారు.
ఈ చిత్రానికి సుమంత్ అశ్విన్ .ఎం, రజనీకాంత్ .ఎస్ నిర్మాతలు. వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్ మరియు ఏబిజి క్రియేషన్స్ వారు చిత్రనిర్మాణంలో భాగస్వాములు.
ఈ చిత్రానికి సంగీతం: సమర్థ్ గొల్లపూడి, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, కూర్పు: జునైద్ సిద్ధిఖీ, ప్రొడక్షన్ డిజైనర్: భాస్కర్ ముదావత్ , స్టిల్స్ : ఎం. రిషితా దేవి , పీఆర్వో: పులగం చిన్నారాయణ, డిజిటల్ ప్రమోషన్స్: సుధీర్ తేలప్రోలు, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే, కో-డైరెక్టర్: యువి సుష్మ, కో ప్రొడ్యూసర్స్: జె. శ్రీనివాసరాజు, మంతెన రాము, నిర్మాతలు: సుమంత్ అశ్విన్, రజనీకాంత్ .ఎస్, రచన, దర్శకత్వం: ఎం.ఎస్ రాజు.